మామిడి చేపల పులుసు
 • 439 Views

మామిడి చేపల పులుసు

కావలసినవి:

 • చేపలు - అరకిలో
 • మామిడి కాయ - ఒకటి
 • ఉల్లిపాయలు - నాలుగు
 • వెల్లుల్లి - చిన్న పాయ ఒకటి
 • జీలకర్ర - అర టీస్పూన్‌
 • ధనియాలు - 10 గ్రాములు
 • పచ్చిమిర్చి - ఆరు
 • కరివేపాకు - ఒక కట్ట
 • కొత్తిమీర - ఒక కట్ట
 • మిరపపొడి - ఒక టీస్పూన్‌
 • ఉప్పు - తగినంత
 • నూనె - సరిపడా

విధానం:

మొదట చేపలు శుభ్రం చేసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత బాగా ఉప్పు పులిమి కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలను మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో ఉల్లిపాయల పేస్ట్‌, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పొడి, కరివేపాకు, మిరపపొడి, కొత్తిమీర కలుపుకుని ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించాలి. తరువాత మామిడికాయను ముక్కలుగా కోసి ఒక పాత్రలో నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.ఈ మిశ్రమాన్ని చేపముక్కలున్న పాత్రలో పోసి చిన్న మంటపై నెమ్మదిగా ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికిన తరువాత దించుకోవాలి. అంతే మ్యాంగో చేపల పులుసు రెడీ.