మ్యాంగో ఖీర్
  • 547 Views

మ్యాంగో ఖీర్

కావలసినవి:

  • మామిడిపండు - 1,
  • పాలు - తగినన్ని,
  • బియ్యం - టీ స్పూన్,
  • పంచదార - టీ స్పూన్,
  • జీడిపప్పు పలుకులు (వేయించినవి) - అర టీ స్పూన్,
  • ఏలకులపొడి - చిటికెడు,
  • మామిడిపండు గుజ్జు - టీ స్పూన్,
  • బాదంపప్పు - అర టీ స్పూన్

విధానం:

పాలు, బియ్యం, పంచదార కలిపి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. మామిడిపండు పై తొక్క తీసి, తురమాలి. రైస్ ఖీర్‌ను ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి, అందులో మామిడిపండు గుజ్జు, మామిడిపండు తురుము, ఏలకులపొడి వేసి కలపాలి. పైన జీడిపప్పు, బాదంపప్పు పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. చల్లగా, తియ్యగా, మృదువుగా, రుచిగా ఉండే ఈ ఖీర్‌ను పిల్లలు అమితంగా ఇష్టపడతారు. ఈ వేసవిలో వారికిది బలవర్ధకమైన ఆహారం కూడా. (పంచదారకు బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు)