మ్యాంగో లస్సీ
  • 441 Views

మ్యాంగో లస్సీ

కావలసినవి:

  • పెరుగు - పావులీటరు
  • మామిడి పండ్ల గుజ్జు - 1 కప్పు
  • పంచదార - ముప్పావు కప్పు
  • ఏలకుల పొడి - చిటికెడు
  • తేనె - 2 టీ స్పూన్లు
  • చల్లటి నీళ్లు - 1 కప్పు
  • మామిడి ముక్కలు - 2 టేబుల్‌ స్పూన్లు

విధానం:

మిక్సీలో పెరుగు, మామిడి గుజ్జు, పంచదార, తేనె, ఏలకుల పొడి, చల్లని నీళ్లు పోసి బ్లెండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాస్‌లో పోసి ఐస్‌ముక్కలు, కొంచెం మామిడి ముక్కలు వేసి సర్వ్‌ చేయండి.