మ్యాంగో మిల్క్‌షేక్‌
  • 442 Views

మ్యాంగో మిల్క్‌షేక్‌

కావలసినవి:

  • మామిడిపండు - 1,
  • చల్లని పాలు - పావులీటరు
  • పంచదార - సరిపడా(పండు తీపిని బట్టి)

విధానం:

బంగినపల్లి మామిడిపండు తొక్కుతీసి ముక్కలు కోసుకోవాలి. వాటికి పంచదార జోడించి మిక్సీలో తిప్పుకోవాలి. ఆ గుజ్జుకు పాలు, ఐస్‌ముక్కలు కలిపి బాగా నురుగు వచ్చేవరకూ మిక్సీలో తిప్పుకోవాలి. తరువాత చూడచక్కని గాజుగ్లాసులో వేసిస్తే పిల్లలు క్షణాల్లో జుర్రేస్తారు. దీన్ని మరింత ప్రత్యేకంగా మార్చాలనుకుంటే పైన వెనిల్లా లేక మ్యాంగో ఐస్‌క్రీమ్‌ ఒక స్కూప్‌ జతచేస్తే చాలు! చవులూరించే రుచి... చల్లదనపు హాయి!