మ్యాంగో ఫిర్నీ
  • 427 Views

మ్యాంగో ఫిర్నీ

కావలసినవి:

  • బియ్యం - 2 కప్పులు,
  • మామిడి పండ్ల గుజ్జు - 1 కప్పు,
  • పాలు - ఒక కప్పు
  • పంచదార - ఒక కప్పు,
  • ఏలకుల పొడి - చిటికెడు,
  • బాదం పప్పు - 1 టీ స్పూన్‌
  • పిస్తా పప్పు - 1 టీ స్పూన్‌

విధానం:

బియ్యం కడిగి నానబెట్టాలి. నీళ్లు లేకుండా వడకట్టి కాసేపు ఆరబెట్టాలి. మిక్సీలో వేసి పిండి చెయ్యాలి. పాలు కాచి అందులో పంచదార కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి అందులో బియ్యం పిండి వేసి కలుపుతూ ఉడకనివ్వాలి. మామిడి పండ్ల గుజ్జును అందులో కలిపి చిక్కగా అయ్యాక ఏలకుల పొడి వెయ్యాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని మరో పాత్రలో తీసుకుని బాదం, పిస్తా పప్పులతో అలంకరించి వడ్డించాలి.