మామిడికాయ పకోడీ
  • 434 Views

మామిడికాయ పకోడీ

కావలసినవి:

  • మామిడికాయ తురుము - అర కప్పు;
  • బంగాళదుంపల తురుము - పావు కప్పు;
  • ఉల్లితరుగు - పావు కప్పు;
  • శనగపిండి - అర కప్పు;
  • కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు;
  • అల్లం + పచ్చిమిర్చి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు;
  • ఉప్పు - తగినంత;
  • నూనె - వేయించడానకి తగినంత

విధానం:

ఒక గిన్నెలో మామిడితురుము, బంగాళదుంపల తురుము, ఉల్లి తరుగు, శనగపిండి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర తురుము, తగినంత ఉప్పు వేసి సరిపడా నీళ్లతో పకోడీ పిండిలా కలిపి పదినిముషాలు పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలి ఉంచి, అందులో నూనె పోసి కాగాక పిండిని పకోడీల్లా వేసి తీయాలి. సాస్‌తో కలిపి తింటే బాగుంటాయి.