మటర్ పనీర్
 • 532 Views

మటర్ పనీర్

కావలసినవి:

 • పనీర్ - పావు కేజీ (పనీర్ ముక్కలను నెయ్యిలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి, పక్కనుంచాలి),
 • పచ్చిబఠాణీలు - చిన్న కప్పు,
 • ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి),
 • అల్లం - చిన్న ముక్క + పచ్చిమిర్చి - 3 (పేస్ట్ చేయాలి),
 • టొమాటోలు - 2 సన్నగా తరగాలి),
 • కారం - పావు టీ స్పూన్ (తగినంత)
 • పసుపు - చిటికెడు,
 • ధనియాల పొడి - టీ స్పూన్
 • కసూరి మెంతి (మెంతి ఆకుల పొడి, మార్కెట్లో లభిస్తుంది) - అర టీ స్పూన్,
 • గరం మసాలా - చిటికెడు,
 • మీగడ - టీ స్పూన్ క్రీమ్ అయ్యేలా స్పూన్‌తో చిలకాలి,
 • ఉప్పు - రుచికి తగినంత

విధానం:

గిన్నెలో నూనె వేసి వేడయ్యాక, ఉల్లిపాయలు వేయించుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాలపొడి, పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. కొద్దిగా నీరు కలిపి ఉడికించాలి. టొమాటో తరుగు వేసి నాలుగైదు నిమిషాలు ఉడికించి, మంట తీసేయాలి. చల్లారిన తర్వాత గరిటెతో లేదా మిక్సీలో వేసి పేస్ట్ చే యాలి. టొమాటో పేస్ట్‌లో కప్పు నీళ్లు చేర్చి, మళ్లీ మరిగించాలి. మంట తగ్గించి, దీంట్లో పచ్చి బఠాణీలు వేసి ఉడికించాలి. తర్వాత పనీర్ ముక్కలు, ఉప్పు వేసి 8 నిమిషాలు ఉడకనివ్వాలి. మీగడ, గరంమసాలా, కసూరి మెంతి పొడి వేసి కలిపి, కొద్దిగా ఉడికించి, మంట తీసేయాలి.
థిక్‌గా అయితే, కొద్దిగా పాలు కలపాలి. ఈ మటర్ పనీర్‌ను రోటీ మధ్యలో పెట్టి, రోల్ చేసి, బాక్స్‌లో పెట్టాలి లేదా విడిగానూ బాక్స్‌లో పెట్టి ఇవ్వవచ్చు.