మీల్మేకర్ నీళ్లలో నానబెట్టి, మెత్తగా అయిన తరువాత, పిండి నీళ్లను తీసివేసి, వాటిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బఠానీలను పేస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో మీల్మేకర్ ముక్కలు శనగపిండి, బియ్యప్పిండి, బఠానీపేస్ట్, కారం, ధనియాల పొడి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, మెంతి పొడి, సరిపోయినంత నీరు వేసి ముద్దలా కలుపుకోవాలి. తరువాత కడాయిలో నూనె మరిగాక, దానిలో చిన్న చిన్న పిండి ముద్దలు వేసి, ఫ్రై చేసి, ప్లేట్లోకి తీసుకోవాలి. పకోడినిసాస్తో వేడి వేడిగా సర్వ్ చేయాలి.