బాణలిలో నూనె వే డయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, పసుపు, ఉల్లితరుగు, కరివేపాకు... ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించాలి. తర్వాత గోంగూర వేసి కొద్దిగా వేగాక దోసకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించుకున్న శనగపప్పు, కప్పు నీళ్లు, ధనియాలపొడి, ఉప్పు వేసి ఉడికించి, పైన కొత్తిమీర చల్లి దింపుకోవాలి. ఇది జొన్నరొట్టెలు, చపాతీలు, అన్నంలోకి బాగుంటుంది. జంతికల కాంబినేషన్‌తో తింటే రుచిగా ఉంటుంది.