కాజు మఫిన్‌ కేక్‌
  • 524 Views

కాజు మఫిన్‌ కేక్‌

కావలసినవి:

  • మైదా-140 గ్రా.
  • పాలు-200 గ్రా.,
  • పెరుగు-70 గ్రా.,
  • బేకింగ్‌ పౌడర్‌-ఒక టీ స్పూను,
  •  సోడా-అర టీ స్పూను,
  • నీళ్లు - కొద్దిగా,
  • వెనీలా-నాలుగు చుక్కలు,
  • జీడి పప్పులు-అరకప్పు.

విధానం:

ఒక గిన్నెలో మైదాపిండి, బేకింగ్‌ పౌడర్‌, సోడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులో జీడి పప్పులు, వెనీలా కొద్దిగా నీళ్లు, పాలు, పెరుగు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మఫిన్‌ మౌల్డ్స్‌లో పెరుగు రాసి ఈ మిశ్రమాన్ని పెట్టాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకుని, ఓవెన్‌లో 180 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఇరవై నిమిషాల పాటు బేక్‌ చేయాలి. కాజు మఫిన్‌ కేకులు రెడీ అయినట్లే.