మెంతి చికెన్‌
  • 427 Views

మెంతి చికెన్‌

కావలసినవి:

  • చికెన్‌-అర కిలో
  • కస్తూరి మెంతి-2 టేబుల్‌ స్పూన్లు
  • కొత్తిమీర తురుము- టేబుల్‌ స్పూను
  • నూనె- 2 టేబుల్‌ స్పూన్లు
  • పసుపు-టీ స్పూను
  • పెరుగు - కప్పు
  • పలావు ఆకులు-2
  • అల్లం తురుము- 2 టేబుల్‌ స్పూన్లు
  • వెల్లుల్లి తురుము- 2 టేబుల్‌ స్పూన్లు
  • గరం మసాలా- 2 టేబుల్‌ స్పూన్లు
  • ధనియాల పొడి- 2 టేబుల్‌ స్పూన్లు
  • ఉల్లిపాయలు- రెండు
  • పచ్చిమిర్చి తురుము- 2 టేబుల్‌ స్పూన్లు
  • ఉప్పు- సరిపడా

విధానం:

చికెన్‌ ముక్కల్ని శుభ్రంగా కడగాలి. బాణలిలో నూనె పోసి వేడి చేయాలి. పలావు ఆకులు, గరం మసాలా వేయాలి. తరువాత ఉల్లిముక్కలు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి తురుము, పసుపు, ధనియాల పొడి, పచ్చి మిర్చి వేసి వేయించాలి. చికెన్‌ ముక్కలకు గిలకొట్టిన పెరుగు వేసి సుమారు పది నిమిషాలపాటు కలుపుతూ వేయించాలి. తరువాత కస్తూరి మెంతి, గరం మసాలా, కొత్తిమీర తురుము, ఉప్పు, నీళ్ళు పోసి కలపాలి. మూత పెట్టి తక్కువ మంట మీద ముక్క ఉడికే వరకూ ఉంచి దించాలి.