మేథీ పనీర్ కర్రీ
 • 469 Views

మేథీ పనీర్ కర్రీ

కావలసినవి:

 • పనీర్... 400 గ్రా.
 • శెనగపిండి... ఒక కప్పు
 • నూనె... రెండు టీ.
 • మెంతి ఆకులు... రెండు కప్పులు
 • మిరియాలపొడి... అర టీ.
 • జీలకర్ర... ఒక టీ.
 • టొమోటో గుజ్జు... అర కప్పు
 • నీళ్లు... తగినన్ని
 • తాజా మీగడ... ఒక టీ.
 • ఉప్పు... సరిపడా

విధానం:

శెనగపిండిలో ఉప్పు కలిపి ఉంచాలి. పనీర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా కోసి, శెనగపిండిలో దొర్లించాలి. వెడల్పాటి బాణలిలో కొద్దిగా నూనె వేసి పనీర్ ముక్కల్ని బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే బాణలిలో మిగిలి ఉన్న నూనెలోనే టొమోటో గుజ్జు, మిరియాలపొడి, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, మెంతి ఆకులు, నీళ్లు పోసి అరగంటసేపు తక్కువ మంటమీద ఉడికించాలి. తరువాత పనీర్ ముక్కలు వేసి కాస్త గ్రేవీ ఉండగానే దించి పైన మీగడ వేసి కలిపి వడ్డించాలి. ఇది వేడి వేడి అన్నం, చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. మీరూ ఓసారి ట్రై చేస్తారు కదూ...?!