పాల అప్పమ్
  • 455 Views

పాల అప్పమ్

కావలసినవి:

  • బియ్యం - అర కేజీ,
  • కొబ్బరిపాలు - 250 మి.లీ.,
  • ఈస్ట్ - 10 గ్రా. (నీళ్లల్లో కలిపి వాడాలి),
  • ఉప్పు - తగినంత,
  • పంచదార - టీ స్పూను

విధానం:

బియాన్ని రెండు గంటల పాటు నానబెట్టాలి. అందులో మూడు వంతుల బియ్యాన్ని మిక్సీలో వేసి దోసెపిండి మాదిరిగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచాలి. మిగతా బియ్యాన్ని అన్నంలా వండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తరవాత ఈ రెండిటినీ కలిపేయాలి. ఈ మిశ్రమంలో కొంచెం ఈస్ట్ వేసి బాగా కలిపి నాలుగు గంటల పాటు అలాగే ఉంచితే పిండి బాగా పులిసి గుల్లగా తయారవుతుంది. తరవాత అందులో ఉప్పు, కొబ్బరిపాలు, పంచదార వేసి కలపాలి. ఆపమ్ పాన్, మూతలను (గుంటలా లోతుగా ఉంటుంది. మార్కెట్‌లో దొరుకుతుంది), రెండిటినీ విడివిడిగా స్టౌ మీద వేడి చేయాలి. బాగా వేడయిన తరవాత మంట ఆర్పేసి గరిటెడు పిండి అందులో వేసి వేడి మూత పెట్టాలి. ఆ వేడికి ఆపం ఉడుకుతుంది. దీనిని రెండోవైపు తిప్పవలసిన అవసరం లేదు. (ఒక కోడిగుడ్డును ఉడికించి మెత్తగా చిదిమి దానిని ఒక పరిశుభ్రమైన వస్త్రంలో కట్టి కొద్దిగా నూనెలో ముంచి ఆపం వేసే పెనం మీద రుద్దితే ఆపం బాగా వస్తుంది. కూరగాయముక్కను నూనెలో ముంచి రుద్దినా బాగానే వస్తుంది)