పాల చాక్లెట్
  • 534 Views

పాల చాక్లెట్

కావలసినవి:

  • పాలు - కప్పు
  • పెరుగు - కప్పు
  • పంచదార - కప్పు
  • నెయ్యి - చెంచా
  • యాలకులపొడి - కొద్దిగా.

విధానం:

ఒక గిన్నెలో పాలు తీసుకొని బాగా మరిగించాలి. ఆ తరువాత పంచదార, పెరుగు, యాలకులపొడి ఒకదాని తరువాత ఒకటి వేసి మంట తగ్గించి కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరగా వచ్చిన తరువాత నెయ్యి చేర్చి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి. అరచేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని వేడి తగ్గాక ఈ మిశ్రమాన్ని బిళ్లల్లా చేసుకోవాలి. అంతే.. నోట్లో వేసుకోగానే కరిగిపోయే పాల చాక్లెట్ రెడీ. ఇది పిల్లలు బాగా ఇష్టపడి తింటారు.