పాల పూరీలు
 • 527 Views

పాల పూరీలు

కావలసినవి:

 • పాలు - అర లీటరు
 • పంచదార - 200గ్రా
 • కొబ్బరి పాలు - అర లీటరు (కొబ్బరి కోరుని మిక్సీలో వేసి చిక్కగా పాలు తీసుకోవాలి)
 • యాలకుల పొడి - కొద్దిగా
 • మైదా - 200గ్రా
 • గోధుమపిండి - 200గ్రా
 • ఉప్పు - అరచెంచా
 • గసగసాలు - 25గ్రా
 • పూరీలు వేయించడానికి
 • సరిపడా నూనె

విధానం:

ముందుగా మైదా, గోధుమపిండి, ఉప్పు, నీళ్లు వేసి పూరీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. కాచిన పాలలో పంచదార, కొబ్బరిపాలు, యాలకుల పొడి, గసగసాల పొడి(నూనె వేయకుండా వేయించి పొడిచేసి ఉంచుకోవాలి) వేసి పంచదార బాగా కరిగేవరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండితో పూరీలు చేసి ఎర్రగా వేయించి ఈ పాలలో వేయాలి. ఇవి బాగా నానితే మంచి రుచితో నోరూరిస్తాయి. ఈ పాల పూరీలు మంచి బలమైన ఆహారం కూడా.