పుదీనా కొబ్బరి పచ్చడి
  • 283 Views

పుదీనా కొబ్బరి పచ్చడి

కావలసినవి:

  • పుదీనా ఆకు - రెండు కప్పులు
  • పచ్చి కొబ్బరి - అరచిప్ప
  • పచ్చిమిర్చి - నాలుగు
  • వెల్లుల్లి - 6 రెబ్బలు
  • నూనె - ఒక టేబుల్‌ స్పూను
  • ఉప్పు - రుచికి తగినంత
  • నిమ్మరసం - ఒక టేబుల్‌ స్పూను
  • జీలకర్ర - ఒక స్పూను

విధానం:

నూనెలో జీల కర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చిలను వేయించి తీసేయాలి. మిగిలిన నూనెలో ముందు పుదీనా ఆకుని, తర్వాత కొబ్బరి (చిన్న) ముక్కల్ని వేసి దోరగా వేయించుకోవాలి. అన్నిటీనీ మిక్సీలో మెత్తగా రుబ్బు కుని ఉప్పు, నిమ్మరసం జతచేయాలి. ఈ పచ్చడి భోజనం మొదట్లో నే అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. (ఈ పచ్చడిని కొబ్బరి లేకుండా వేయించి నువ్వులతో కూడా చేసుకోవచ్చు.అయితే నిమ్మరసానికి బదులు కొంచెం చింతపండు వాడాలి).