మిక్స్‌డ్ దాల్స్ దోశె
  • 555 Views

మిక్స్‌డ్ దాల్స్ దోశె

కావలసినవి:

  • బియ్యం... మూడు కప్పులు
  • మినపపప్పు... ఒక కప్పు
  • కందిపప్పు... అర కప్పు
  • శెనగపప్పు... పావు కప్పు
  • పెసర పప్పు... 1/8 కప్పు

విధానం:

బియ్యంతో పాటు పైన చెప్పిన నాలుగు రకాల పప్పులను మూడు లేదా నాలుగు గంటల సేపు నానబెట్టి, ఉప్పు కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి. దీనికి పెసరపిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం పులవాలంటే కాసేపు అలాగే ఉంచేస్తే పులిసిన దోశె పిండి సిద్ధం.

తరువాత దోశెల పెనం స్టౌ పైన పెట్టి మామూలుగా దోశెలు ఎలా చేసుకుంటామో అలా చేస్తే సరి. అంతే నాలుగు రకాల పప్పులతో తయారు చేసిన దోశె రెడీ. ఈ దోశెలకి ఎండుమిర్చి, కొబ్బరితో తయారు చేసిన కొబ్బరి పచ్చడి మంచి కాంబినేషన్. వర్షాకాలంలో ఈ వేడి వేడి దోశెలను తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేనిది.