మిక్స్‌డ్ మసాలా పూరీలు
 • 422 Views

మిక్స్‌డ్ మసాలా పూరీలు

కావలసినవి:

 • మామిడి కాయ ముక్కలు - అర కప్పు(సన్నగా తరిగినవి),
 • గోధుమ పిండి - మూడు కప్పులు,
 • కొత్తిమీర పేస్ట్ - పావు కప్పు,
 • పుదీనా పేస్ట్ - పావు కప్పు,
 • పచ్చిమిర్చి ముక్కలు - పావు కప్పు,
 • ఉల్లి పేస్ట్ - పావు కప్పు,
 • జీలకర్ర - చెంచా,
 • ఉప్పు - సరిపడ,
 • మసాలా పొడి - అర స్పూన్,
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - స్పూన్,
 • పెరుగు - పావు కప్పు,
 • నూనె - వేయించటానికి సరిపడ,
 • ఛాట్ మసాలా - అరస్పూన్

విధానం:

ముందుగా ఓ గిన్నెలో గోధుమ పిండిలో సరిపడ నీళ్లు పోసి పెరుగు, ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత కాసేపాగి ఇందులో మిగిలిన ఉల్లి, పచ్చిమిర్చి తదితర పేస్ట్‌లను మరియూ పైన చేపిన్న మసాల అని వేసి బాగా కలపాలి. దీనిపై తడిబట్ట వేసి ఐదారు నిముషాల పాటు అలానే ఉంచాలి. తర్వాత పిండిని తీసి చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల ఆకారంలో గుండ్రంగా ఒత్తుకోవాలి. బాణాలిలో నూనె వేసి కాగాక ఇందులో పూరీలను వేసి బంగారు వన్నె వచ్చేంత వరకు వేయించి తీయాలి. వీటిని పెరుగు తట్నీతో కలిపి తింటే చాలా రుచికరంగా ఉంటాయి.