పెసర మొలకల చాట్‌
 • 855 Views

పెసర మొలకల చాట్‌

కావలసినవి:

 • మొలకెత్తిన పెసలు - 1 కప్పు
 • టమాటా - 1
 • కీరదోస - 1
 • నిమ్మకాయ - 1
 • మిరియాల పొడి - అర స్పూన్‌
 • జీలకర్ర పొడి - అర స్పూన్‌
 • బంగాళదుంప - 1
 • ఉల్లిపాయ - 1
 • చ్చిమిర్చి - 4
 • ఉప్పు - తగినంత
 • నల్లఉప్పు - అర స్పూన్‌
 • కొత్తిమీర తరుగు - పావు కప్పు

విధానం:

బంగాళదుంప ఉడికించి సన్న ముక్కలు కోయాలి. కీరదోస, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయను సన్నగా తరగాలి. వాటిలో పెసర మొలకలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, నల్ల ఉప్పు కొత్తిమీర తరుగు కలపాలి. చివరిగా ఈ మిశ్రమం పైన నిమ్మరసం పిండితే చాలు. పెసర మొలకల చాట్‌ తయారైనట్లే. ఇష్టమైన వాళ్లు దీన్ని కొద్దిసేపు ఫ్రిజ్‌లో పెట్టి కూడా తినొచ్చు.