మోతిచర్ లడ్డూ
  • 610 Views

మోతిచర్ లడ్డూ

కావలసినవి:

  • శెనగపిండి -2 ' కప్పులు
  •  పాలు - లీటరు
  •  యాలుకల పొడి - టీస్పూన్
  •  నెయ్యి మూడు కప్పులు
  •  పిస్తా, బాదాం పప్పులు అలంకరణకు సరిపడా


పాకానికి:

  •  పంచదార - 2 ' కప్పులు
  •  నీరు -  3 ' కప్పులు
  • నెయ్యి - 3 కప్పులు

విధానం:

బాండీలో పంచదారలో పాటు నీటిని వేసి పంచదార పాకంగా మారేంత వరకు ఉడికించండి. ఈ పాకంలో నెయ్యిను కలిపి పొంగు వచ్చిన తరువాత యాలుకల పొడిని కలపండి. ఇలా తయారుకాబడ్డ పాకాన్ని ఓ పక్కన పెట్టుకోండి.- సిద్ధంగా ఉంచుకున్న శెనగపిండిలో, పాలను కలిపి ' మిశ్రమాన్ని బూందీ చేసుకునేంత జీగటగా కలుపుకోండి'. పాన్ లో నెయ్యిను పోసి వేడిచేసుకోండి వేడెక్కిన నేతిలో శెనగపిండి మిశ్రమాన్ని బూందీ రూపంలో జారవిడవండి. బంగారం రంగు వచ్చేంత వరకు బూందీ పలుకులను వేయించండి.  తయారైన బూందీ పలుకుల్లో తయారుచేసి సిద్ధంగా ఉంచుకున్న పాకాన్ని కలపుకోండి. ఈ మిశ్రమంలో కొద్దిగా వేడినీటిని కలిపి లడ్డూలుగా చుట్టుకోండి. ఇలా చుట్టుకున్న లడ్డూలను చల్లబడిన తరవాత తింటే ఆ రుచే వేరు.. పండుగ సందర్భాల్లోనూ ఈ వంటకాన్ని తయారు చేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టకోవచ్చు.