మొఘలాయీ బిర్యానీ బాద్షాహీ
 • 281 Views

మొఘలాయీ బిర్యానీ బాద్షాహీ

కావలసినవి:

 • మటన్ - అర కేజీ;
 • బాస్మతి బియ్యం - పావు కేజీ;
 • నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు;
 • బాదం పప్పుల తరుగు - 2 టేబుల్ స్పూన్లు;
 • పుదీనా ఆకులు - 10;
 • బటర్ - కప్పు;
 • కొత్తిమీర - కొద్దిగా;
 • జీలకర్ర - అర టేబుల్ స్పూను;
 • ఉల్లి తరుగు - అర కప్పు;
 • ఏలకులు - 2;
 • నూనె - టేబుల్ స్పూను;
 • వెల్లుల్లి రేకలు - 2;
 • అల్లం ముక్క - చిన్నది;
 • కుంకుమ పువ్వు - అర టేబుల్ స్పూను;
 • పచ్చి మిర్చి తరుగు - అర టేబుల్ స్పూను;
 • కారం - అర టేబుల్ స్పూను;
 • దాల్చిన చెక్క - చిన్న ముక్క;
 • పెరుగు - అర కేజీ;
 • పాలు - 125 మి.లీ;
 • నీళ్లు - 3 కప్పులు

విధానం:

బియ్యం కడిగి నానబెట్టాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి. కొద్దిగా నీళ్లలో కుంకుమ పువ్వు వేసి కలపాలి. అల్లం, ఎండు మిర్చి, వెల్లుల్లి, బాదంపప్పులను మిక్సీలో వేసి ముద్ద చేయాలి.బాణలిలో బటర్ వేసి కరిగాక తయారుచేసి ఉంచుకున్న ఈ ముద్ద వేసి వేయించాలి  మటన్, ఉప్పు జత చేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉంచాలి.నీళ్లు పోసి బాగా ఉడికించాలి. (సుమారు ఒక కప్పు గ్రేవీ ఉండేవరకు ఉడికించాలి). ఒక పెద్ద పాత్రలో నీళ్లలో ఉప్పు, బియ్యం వేసి ఉడికించాలి.పెరుగును ఒక వస్త్రంలో గట్టిగా కట్టి ఉన్న నీరంతా పోయేలా పిండేయాలి. లవంగాలు, ఏలకులు, జీలకర్ర, పుదీనా, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర పెరుగులో వేసి కలపాలి.కుంకుమ పువ్వు నీరు, నిమ్మరసం రెండింటినీ మటన్‌లో వేసి కలపాలి.సగం అన్నాన్ని మటన్ మీద వేసి, వేయించి ఉంచుకున్న ఉల్లి తరుగు వేసి మళ్లీ పైన అన్నం వేయాలి. పాలు, కొద్దిగా పెరుగు వేసి మూత ఉంచాలి . సుమారు గంటసేపు స్టౌ మీద ఉంచి దించేయాలి. వేడివేడిగా వడ్డించాలి.