మునగాకు కందిపప్పు చారు
 • 506 Views

మునగాకు కందిపప్పు చారు

కావలసినవి:

 • మునగాకు - కప్పు
 • కందిపప్పు - అర కప్పు
 • చింతపండు - కొద్దిగా
 • పచ్చిమిర్చి - 8
 • (పొడవుగా కట్ చేయాలి)
 • ధనియాలు - టీ స్పూను
 • నూనె - తగినంత
 • మిరియాలు - ఆరు గింజలు
 • జీలకర్ర - టీ స్పూను
 • వెల్లుల్లిరేకలు - 10
 • కరివేపాకు - రెండు రెమ్మలు
 • ఉప్పు- తగినంత
 • పసుపు - తగినంత

విధానం:

ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు, మునగాకు వేసి కుకర్‌లో పెట్టి మెత్తగా ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారిన తరవాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టౌ మీద ఒక మందపాటి గిన్నెను ఉంచి అందులో చింతపండురసం, ఉప్పు, పసుపు, కందిపప్పు మునగాకు మిశ్రమం వేసి బాగా మరిగించాలి. ఒక బాణలిలో ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. తరవాత అందులోనే మరికాస్త నూనె వేసి కాగాక ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి కొద్దిగా వేగాక తీసి పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తరవాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేశాక, అందులోనే వెల్లుల్లి వేసి మరోమారు తిప్పి తీసేయాలి. చివరగా మరుగుతున్న చారులో ఈ పొడి, తాలింపు వేసి ఒక్క పొంగు రానిచ్చి దింపేయాలి.