మునగాకు నువ్వులు మసాలా పొడి
  • 248 Views

మునగాకు నువ్వులు మసాలా పొడి

కావలసినవి:

  • మునగాకు - రెండు కప్పులు;
  • వేయించిన నువ్వులు - కప్పు;
  • ధనియాలు - 2 టీ స్పూన్లు;
  • జీలకర్ర - టీ స్పూను; దాల్చినచెక్క - చిన్నముక్క;
  • అనాసపువ్వులు - 3;
  • వెల్లుల్లిరేకలు - 10;
  • ఎండుమిర్చి - 10; ఉప్పు,
  • పసుపు - తగినంత

విధానం:

ముందుగా మునగాకును శుభ్రం చేసి, కడిగి ఆరబెట్టాలి. స్టౌ మీద బాణలి పెట్టి అందులో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక మునగాకు వేసి తడి ఆరేవరకు వేయించి పక్కన పెట్టాలి. అదే బాణలిలో మరికాస్త నూనె వేసి ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క, అనాసపువ్వు, నువ్వులను విడివిడిగా వేయించి తీసేశాక, ఎండుమిర్చిని కూడా వేయించి చల్లార్చుకోవాలి. అన్నీ చల్లారిన తరవాత మిక్సీలో ఒకటొకటిగా వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా పసుపు, వెల్లుల్లి, ఉప్పు, మునగాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసేయాలి. పది నిముషాలయ్యాక ఈ పొడిని ఒక బాటిల్‌లోకి తీసుకోవాలి. ఇది సుమారు నెలరోజులు నిలవ ఉంటుంది. మునగాకు నువ్వులు మసాలా పొడి అన్నంలోకి, దోసెలపైన జల్లుకొని తినడానికి చాలా రుచిగా ఉంటుంది.