మునగాకు పరోఠాలు
  • 730 Views

మునగాకు పరోఠాలు

కావలసినవి:

  • మునగాకు - 2 కప్పులు;
  • గోధుమపిండి - కప్పు
  • శనగపిండి - టేబుల్‌స్పూను;
  • ధనియాలపొడి - టేబుల్‌స్పూను;
  • జీలకర్రపొడి - టేబుల్‌స్పూను;
  • వెల్లుల్లిరెబ్బలు - 10
  • పచ్చిమిర్చి - 8;
  • ఉప్పు, పసుపు - తగినంత
  • నూనె - రెండు టీస్పూన్లు

విధానం:

ముందుగా మునగాకును శుభ్రం చేసి బాగా కడిగి ఆరబెట్టాలి. బాణలిలో నూనె వేసి వేడయ్యాక మునగాకు వేసి పచ్చివాసన పోయేవరకు మూత పెట్టి మగ్గించాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి ఈ రెండింటినీ మెత్తగా పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని మగ్గుతున్న ఆకులో వేసి కలపాలి. తరవాత ధనియాలపొడి, జీలకర్రపొడి, పసుపు, ఉప్పు వేసి కలిపి స్టౌ మీద నుంచి దింపేయాలి. ఒక గిన్నెలో గోధుమపిండి, శనగపిండి వేసి నీరు పోయకుండా కలిపి అందులో చల్లారిన మునగాకు మిశ్రమం వేసి చపాతీపిండిలా కలపాలి. సుమారు గంటసేపు నానిన తరవాత పరోఠాలా వత్తాలి. స్టౌ మీద పెనం కాలిన తరవాత ఈ పరాఠాను దానిమీద వేసి రెండువైపులా నూనె వేసి కాల్చాలి. మునగాకు పరోఠాలు పెరుగుతో తీసుకుంటే బావుంటాయి.