మునగాకు శనగల వడలు
  • 1471 Views

మునగాకు శనగల వడలు

కావలసినవి:

  • మునగాకు - కప్పు
  • నానబెట్టిన పెద్ద శనగలు - కప్పు
  • ఉల్లితరుగు - కప్పు
  • పచ్చిమిర్చి - పది
  • ఉప్పు - తగినంత
  • జీలకర్ర - టీ స్పూను
  • నూనె - వేయించడానికి సరిపడినంత
  • సన్నగా తరిగిన క్యాప్సికమ్ - అర కప్పు

విధానం:

శనగలను ముందురోజు రాత్రి నానబెట్టాలి. తయారుచేసే ముందు అందులోని నీరంతా వంపేసి, ఆ శనగలు, పచ్చిమిర్చి, ఉప్పు, మునగాకు... వీటన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉల్లితరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి బాగా కలుపుకోవాలి. స్టౌ మీద బాణలి ఉంచి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగాక పిండి మిశ్రమాన్ని చిన్నచిన్న వడలుగా ఒత్తుకుని నూనెలో వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి టిష్యూ పేపర్ మీదకు తీయాలి. మునగాకు శనగల వడలు వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.