ముర్గ్ సేయల్
  • 644 Views

ముర్గ్ సేయల్

కావలసినవి:

  • బోన్‌లెస్ చికెన్-200 గ్రా,
  • నూనె లేదా నెయ్యి-15 గ్రా,
  • అల్లం వెల్లుల్లి పేస్టు-రెండు టీ స్పూన్లు,
  • పచ్చిమిర్చి పేస్ట్-రెండు టీ స్పూన్లు,
  • ఉల్లిపాయ తరుగు-పావు కప్పు,
  • టొమాటో ముక్కలు-పావు కప్పు,
  • పసుపు-చిటికెడు
  • ధనియాల పొడి-టీ స్పూన్,
  • కారం-అర టీ స్పూన్
  • జీడిపప్పు-ఐదు పలుకులు,
  • పుచ్చకాయ గింజలు-టీ స్పూన్
  • ఉప్పు-తగినంత,
  • సోయా బాజీ ఆకులు లేదా కొత్తిమీర తరుగు-రెండు టీ స్పూన్లు,
  • ఫ్రెష్ క్రీమ్-100 గ్రా
  • గరం మసాల పౌడర్-టీ స్పూన్

విధానం:

ముందుగా బోన్‌లెస్ చికెన్‌ని తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్‌లో నూనె లేదా నెయ్యిని వేసి అది కాగాక అందులో ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత అందులో గ్రైండ్ చేసిన అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి తిరిగి కాసేపు వేయించి టొమాటో ముక్కలు కలిపి తక్కువ సెగ మీద పెట్టాలి. అందులో మెత్తగా పేస్ట్ చేసుకున్న జీడిపప్పు, పుచ్చగింజల మిశ్రమం, ఫ్రెష్ క్రీమ్ తగినన్ని నీళ్లు, ఉప్పు, గరం మసాల పౌడర్ వేసి ఉడుకుతుండగా అందులో తరిగిన సోయా బాజీ ఆకులు లేదా కొత్తిమీర తరుగు, చికెన్ ముక్కలు వేసి తక్కువ సెగ మీద మూత పెట్టి ఉడికించాలి. ఈ మిశ్రమం దగ్గరగా వస్తుండగా అందులో పచ్చిమిర్చి ముద్ద వేసి రెండు నిమిషాలపాటు ఉంచి బౌల్‌లోకి తీసుకుని సోయా బాజీ ఆకులతో కాని కొత్తిమీరతో కాని గార్నిష్ చేయాలి. ఈ డిష్‌ని రైస్ ఐటమ్స్‌తో కాని రోటీస్‌తో కాని తింటే రుచిగా ఉంటుంది.