మురుకులు
  • 232 Views

మురుకులు

కావలసినవి:

  • బియ్యప్పిండి - 3 కప్పులు,
  • సగ్గుబియ్యం - 1 కప్పు,
  • కారం - 2 టీ స్పూన్లు,
  • నువ్వులు - అర కప్పు,
  • వెన్న -4 టేబుల్ స్పూన్లు,
  • నూనె - వేగించడానికి సరిపడా,
  • నీరు - 2 కప్పులు

విధానం:

ఒక గిన్నెలో తగినన్ని నీటిలో సగ్గుబియ్యం వేసి కుక్కరులో ఉంచి, ఆవిరిపై 5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత ఒక వెడల్పాటి పాత్రలోకి ఉడికిన సగ్గుబియ్యం తీసుకుని అందులో కారం, నువ్వులు, ఉప్పు, బియ్యప్పిండి చేర్చి నీరు కలుపుతూ ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మురుకుల యంత్రం సహాయంతో తిప్పుకుంటూ, నూనెలో దోరగా వేగించుకోవాలి.