మష్రూమ్‌ కట్లెట్స్‌
  • 391 Views

మష్రూమ్‌ కట్లెట్స్‌

కావలసినవి:

  • మష్రూమ్స్‌- 400 గ్రా.
  • సన్నగా తరిగిన ఉల్లిపాయ - ఒక కప్పు
  • నూనె - 2 టేబుల్‌ స్పూన్లు
  • జీలకర్ర- 1 టేబుల్‌ స్పూన్‌
  • అల్లం పేస్ట్‌ - 2 టీ స్పూన్లు
  • ఆలుగడ్డ (ఉడకబెట్టి చిదిమినది) - 1 కప్పు
  • ధనియాలపొడి - 2 టీ స్పూన్లు
  • ఆమ్‌చూర్‌ (ఎండబెట్టిన మామిడిపొడి) - 2 టీస్పూన్లు
  • ఉప్పు - 11/2 టీస్పూన్లు
  • తరిగిన పచ్చి మిర్చి - 2 టీస్పూన్లు
  • గుడ్లు - 2 (బాగా గిలకొట్టినవి)
  • మైదా - అరకప్పు, బ్రెడ్‌ అంచులు

విధానం:

ముందుగా బాణలిలో నూనె వేసి అందులో జీలకర్ర, అల్లం పేస్ట్‌ వేసి బాగా కలిపి వేగనివ్వాలి. దానిలో మష్రూమ్స్‌ను వేసి అదంతా దానికి పట్టి పొడిపొడిగా అయ్యేదాకా వేయించాలి. తర్వాత ధనియాల పొడి, ఆమ్‌చూర్‌, ఉప్పు, మిరపకాయ ముక్కలు వేసి దానిని 2, 3 సార్లు కలియబెట్టి స్టౌ ఆపేయాలి. చల్లారిన తర్వాత అం దులో ఉడకబెట్టి చిదిమిన ఆలు గడ్డను కలపాలి. తర్వాత ఒక కవర్‌పై గుండ్రంగా కానీ కోడిగుడ్డు ఆకారంలో కానీ చేసుకొని దానిని పిండిలో దొర్లించి తర్వాత గు డ్డు సొనలో ముంచి దానిని పొడి చేసుకున్న బ్రెడ్‌లో పొర్లించాలి. ఇలా రెండుసార్లు చేసిన తర్వాత వాటిని నూనెలో బంగారు రంగు వచ్చే దాకా వేయించి తీసివెయ్యాలి. దీనిలో సాస్‌ వేసి వే డి వేడిగా సర్వ్‌ చేస్తే రుచికరంగా ఉంటాయి.