తమలపాకు ,పుట్టగొడుగుల రోల్స్
  • 288 Views

తమలపాకు ,పుట్టగొడుగుల రోల్స్

కావలసినవి:

  • తమలపాకులు పెద్దవి 20
  • మష్రూమ్స్ 200 gms
  • బంగాళదుంపలు 2
  • ఉల్లికాడ ముక్కలు 4 tbsp
  • వేయించిన జీలకర్ర 50gms
  • చీజ్ 50 gms
  • చాట్ మసాలా పొడి 1 tsp
  • శనగపిండి 250 gms
  • అల్లంవెల్లుల్లి ముద్ద 2 tsp
  • వాము 4 tsp
  • కారం పొడి 4 tsp
  • కుంకుమ పువ్వు(కేసర్ రంగు) చిటికెడు
  • ఉప్పు తగినంత
  • నూనె వేయించడానికి

విధానం:

తమలపాకుల్ని తడిగుడ్డతో తుడిచి శుభ్రం చేయాలి. తరిగిన పుట్టగొడుగులు, ఉడికించిన బంగాళదుంపలు, తురిమిన చీజ్, ఉల్లికాడముక్కలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కుంకుమపువ్వు అన్నీ బాగా కలపాలి. ఒక్కో తమలపాకు మధ్య ఈ మిశ్రమాన్ని కొద్దిగా పెట్టి సిగార్స్‌లా చుట్టాలి. అవి విడిపోకుండా టూత్ పిక్స్ గుచ్చాలి. తర్వాత శనగపిండిలో అల్లం వెల్లుల్లి ముద్ద, వాము, ఉప్పు, కారం వేసి జారుడుగా కలపాలి. ఈ పిండిలో తమలపాకు రోల్స్‌ని ముంచి కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. వీటి మీద చాట్ మసాలా పొడి చల్లి టొమాటో పచ్చడితో తింటే చాలా బాగుంటాయి.