మష్రూమ్ ఫ్రై
 • 288 Views

మష్రూమ్ ఫ్రై

కావలసినవి:

 • మష్రూమ్ ముక్కలు - కప్పు,
 • ఉల్లితరుగు - పావు కప్పు,
 • ఉప్పు - తగినంత
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను,
 • మిరియాలపొడి - అర టీ స్పూను,
 • పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను,
 • కొత్తిమీర - టీ స్పూను,
 • కరివేపాకు పొడి - టీ స్పూను,
 • నిమ్మరసం - టీ స్పూను,
 • నూనె - 5 టేబుల్ స్పూన్లు,
 • పసుపు - చిటికెడు

విధానం:

ఉప్పు కలిపిన వేడినీటిలో మష్రూమ్ ముక్కలను అర గంటసేపు నానబెట్టాలి  బాణలిలో నూనె కాగాక ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి  మష్రూమ్ ముక్కలు, మిరియాలపొడి, కరివేపాకు పొడి, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి వేయించాలి  నిమ్మరసం జతచేసి రెండు నిముషాల తరువాత దించేయాలి.