మష్రూమ్‌ స్వీట్‌ కార్న్‌ సూప్‌
  • 540 Views

మష్రూమ్‌ స్వీట్‌ కార్న్‌ సూప్‌

కావలసినవి:

  • రైస్‌ స్టాక్‌ (గంజి) - 3 కప్పులు,
  • మష్రూమ్స్‌ - 200 గ్రా
  • స్వీట్‌ కార్న్‌ - 1 కప్పు,
  • కార్న్‌ఫ్లోర్‌ - 1 టేబుల్‌ స్పూన్‌
  • మిరియాలపొడి - అర టీ స్పూన్‌,
  • అజినమోటో - చిటికెడు
  • సోయాసాస్‌ - పావు టీ స్పూన్‌,
  • ఉప్పు - తగినంత

విధానం:

వానాకాలంలో వేడివేడి తినుబండారాల పైనే పిల్లాపెద్దా మక్కువ చూపుతారు. రుచికరమైన ఈ సూప్‌ని ఎవరైనా ఇష్టపడతారు. మష్రూమ్‌లు నిలువుగా కోసుకోవాలి. ఈ ముక్కలను, స్వీట్‌కార్న్‌ను కలిపి ఉడకబెట్టాలి. తర్వాత వీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. గంజిని స్టౌమీద పెట్టి మరుగుతున్నప్పుడు ఉడకబెట్టిన మష్రూమ్‌ ముక్కలు, స్వీట్‌ కార్న్‌ అందులో వేయాలి. అజినమోటో, కార్న్‌ఫ్లోర్‌ నీళ్లలో కలిపి అందులో వేసి కలపాలి. అంతే మష్రూమ్‌ స్వీట్‌ కార్న్‌ సూప్‌ రెడీ. మష్రూమ్‌ స్వీట్‌ కార్న్‌ సూప్‌ తాగేముందు సోయాసాస్‌ వేసుకుంటే బావుంటుంది.