బెండకాయ మటన్‌
  • 342 Views

బెండకాయ మటన్‌

కావలసినవి:

  • బెండకాయలు-అర కిలో
  • మటన్‌-అరకిలో,
  • నెయ్యి-2 టేబుల్‌ స్పూన్లు,
  • జీలకర్ర- టీ స్పూను,
  • దాల్చిన చెక్క-2 అంగుళాల ముక్క, నల్ల యాలకులు-నాలుగు
  • మిరియాలు-పది, ఉల్లిపాయలు-రెండు
  • పచ్చి మిర్చి-నాలుగు,
  • అల్లం వెల్లుల్లి-2 టీ స్పూన్లు, పసుపు-అర టీ స్పూను,
  • ఉప్పు-రుచికి సరిపడా, ధనియాల పొడి-2 టీ స్పూన్లు
  • కొత్తిమీర తురుము-4 టేబుల్‌ స్పూన్లు
  • టొమాటోలు- రెండు,
  • నూనె-2 టేబుల్‌ స్పూన్లు
  • కారం- టీ స్పూను,
  • గరం మసాల పొడి-టీ స్పూన్లు,
  • కొత్తిమీర తురుము- 4 టేబుల్‌ స్పూను

విధానం:

బెండకాయలు కడిగి తొడిమలూ, చివర్లూ తీసేసి ఒకవైపున చీల్చినట్లుగా గాటు పెట్టాలి. ఓ బాణలిలో నూనె వేసి మిగిలిన జీలకర్ర వేసి వేగాక బెండకాయలు వేసి వేయించి ఉంచాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో నెయ్యి వేసి కాగాక అర టీ స్పూను జీలకర్ర దాల్చిన చెక్క, నల్ల యాలకులు, మిరియాలు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరువాత చీల్చిన పచ్చిమిర్చి, మటన్‌ ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి ,ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. మంచినీళ్ళు పోసి ఓ సారి కలిపి ఓ పది నిమిషాలు ఉడికించాలి. తరువాత టొమాటో గుజ్జు, కారం, గరం మసాలా వేసి కలపాలి. ఇప్పుడు కొత్తిమీర తురుము వేసి ఉప్పు సరిచూసి కుక్కర్‌ మూత పెట్టి ఓ విజిల్‌ రానివ్వాలి. మంట తగ్గించి సిమ్‌లో ఇరవై నిమిషాల పాటు ఉడికించి దించాలి.