మటన్ చట్నీ
 • 406 Views

మటన్ చట్నీ

కావలసినవి:

 • బోన్‌లెస్‌ మటన్... అర కేజీ
 • టొమోటోలు... మూడు
 • ఉల్లిపాయలు... రెండు
 • అల్లంవెల్లుల్లి పేస్ట్... రెండు టీ.
 • పసుపు... ఒక టీ.
 • కారం... 3 టీ.
 • నూనె.. అర కప్పు
 • నిమ్మకాయలు... రెండు
 • ఉప్పు... తగినంత


పోపుకోసం...

 • ఎండుమిర్చి...4
 • జీలకర్ర... ఒక టీ.
 • కరివేపాకు... రెండు కట్టలు
 • నూనె... రెండు టీ.

విధానం:

ప్రెషర్‌కుక్కర్‌లో మటన్‌ వేసి చిటికెడు పసుపు, కాస్తంత ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. మాంసం ఉడికాక మిగిలిన నీటిని పూర్తిగా వంపేయాలి. మటన్‌ను పప్పుగుత్తితో మెత్తగా మెదపాలి. కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. ఆపై అల్లంవెల్లుల్లి వేసి మిగిలిన పసుపు, కారం, ఉప్పు వేయాలి.