దోస మటన్
  • 115 Views

దోస మటన్

కావలసినవి:

  • దోసకాయ ముక్కలు (మీడియం సైజులో కట్‌చేసినవి) - కప్పు (చెక్కు తీసినవి)
  • మటన్ - పావుకేజీ
  • ఎండుకారం - 5 టీ స్పూన్లు
  • నూనె - 5 టీ స్పూన్లు (తగినంత వేసుకోవచ్చు)
  • ఉప్పు - 5 టీ స్పూన్లు
  • అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 3 టీ స్పూన్లు
  • ఉల్లిపాయలు - 3 టీ స్పూన్లు
  • పసుపు - అర టీ స్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • సాజీర - అర టీ స్పూన్
  • ఎండుకొబ్బరి - 2 టీ స్పూన్లు
  • మసాలా (2 ఏలకులు + 3 లవంగాలు + ధనియాలు. వేయించి, దంచి పొడి చేయాలి) - టీ స్పూన్
  • కొత్తిమీర - 3 టీ స్పూన్లు

విధానం:

వెడల్పాటి పాత్రలో శుభ్రపరిచిన మటన్, కారం, అల్లం- వెల్లుల్లిపేస్ట్, కొద్దిగా పసుపు కలిపి పది నిమిషాలు పక్కన ఉంచాలి. స్టౌ పై కుక్కర్ పెట్టి నూనె వేసి, వేడయ్యాక సాజీర, ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత పక్కన కలిపి ఉంచిన మటన్ ముక్కలను కుక్కర్‌లో వేసి కొద్దిగా ఉడకనివ్వాలి. తర్వాత అందులో దోసకాయ ముక్కలు, ఉప్పు, కొబ్బరి పొడి, మసాలా వేసి కుక్కర్‌మూత ఫిక్స్ చేసి, పైన వెయిట్ పెట్టాలి. కుక్కర్ రెండు, మూడు విజిల్స్ వచ్చాక దించి, విజిల్ పూర్తిగా రావడం ఆగిపోయాక మూత తీసి కొత్తిమీర చల్లాలి. అన్నం, చపాతీ, జొన్నరొట్టెల్లోకి మటన్ దోసకాయ కాంబినేషన్ టేస్టీగా ఉంటుంది.