మటన్ విడిగా ఉడికించి పక్కన పెట్టాలి. మరిగించిన నీళ్లలో పాలకూర వేసి, తర్వాత నీరు వంపేసి గ్రైండ్ చేసుకోవాలి. బాణలిలో నూనె వేడయ్యాక సాజీర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పాలక్ పేస్ట్ వేసి నూనె తేలేవరకు ఉడికించాలి. పనీర్ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఉడికిన మటన్ వేసి మూత పెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత కొబ్బరిపొడి, ధనియాలపొడి, గరం మసాలా వేసి కలిపి ఉడికాక, చివరగా కొత్తిమీర చల్లి దించాలి.