మటన్ పికిల్
  • 472 Views

మటన్ పికిల్

కావలసినవి:

  • బోన్‌లెస్‌ మాంసం - 1కిలో
  • వెల్లుల్లి, అల్లం పేస్టు - 1 గరిటెడు,
  • కారం - అరకప్పు
  • ఉప్పు - గరిటెడు
  • లవంగాల పొడి - అర చెంచా
  • నూనె - అరకిలో,
  • నిమ్మకాయ - ఒకటి

విధానం:

మాంసం చిన్న ముక్కలుగా కొయ్యాలి. ముక్కలు కాసేపు ఆరనివ్వాలి. మూకుడులో నూనె కాగిన తరువాత ముక్కల్ని వేయించాలి. మాంసం ముక్క ఉడకడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. ముక్క ఉడికిందీ లేనిదీ చూసుకుని, నూనెలోంచి ముక్కల్ని గిన్నెలోకి తీసుకోవాలి. మూకుడులో ఎక్కువగా ఉన్న నూనె తీసేసి, స్టౌ తక్కువ మంటమీద ఉంచి అల్లం వెల్లుల్లి ముద్ద, లవంగాల పొడి, ఉప్పు, కారం వేసుకోవాలి. స్టౌ ఆర్పివేసి, వేయించిన మాంసం ముక్కలు వేసి అన్ని ముక్కలకు మసాలా కారం పట్టేలా కలపాలి. ఇష్టమైతే చల్లారిన తరువాత నిమ్మకాయ రసం పిండుకోవాలి.