నట్టీ డిలైట్
  • 432 Views

నట్టీ డిలైట్

కావలసినవి:

  • చల్లటి పెరుగు - 120 గ్రా.
  • నట్స్ (బాదాం పప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్) - 50 గ్రా.
  • పంచదార - 40 గ్రా.
  • చల్లటి నీరు - 20 ఎం.ఎల్

విధానం:

నాన్‌స్టిక్ పాన్‌లో నట్స్ వేసి కొద్దిగా వేయించాలి. అందులో పంచదార వేసి, కరిగించాలి. తర్వాత పాన్ దించి, పంచదార మిశ్రమాన్ని చల్లబడేంతవరకు ఉంచాలి. ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో వేసి, కొద్దిగా క్రష్ చేయాలి. పెరుగును బాగా చిలికి, అందులో చల్లటి నీళ్లు పోయాలి. క్రష్ చేసిన పంచదార మిశ్రమాన్ని గార్నిష్ చేసి, చల్ల చల్లగా సర్వ్ చేయాలి.