నాటుకోడి పులుసు
  • 549 Views

నాటుకోడి పులుసు

కావలసినవి:

  • నాటుకోడి ముక్కలు… అరకేజీ
  • నూనె… ఒక కప్పు
  • కారం… ఐదు టీ.
  • ధనియాలపొడి… ఐదు టీ.
  • పసుపు… అర టీ.
  • గరంమసాలా… ఒక టీ.
  • కొబ్బరిముద్ద… ఐదు టీ.
  • అల్లంవెల్లుల్లి మిశ్రమం… మూడు టీ.
  • ఉప్పు… తగినంత

విధానం:

ఈకలు తీసి బాగా కాల్చిన నాటుకోడికి పసుపు, ఉప్పు పూసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ప్రెషర్‌ పాన్‌లో నూనె పోసి కాగాక చికెన్‌ ముక్కలు వేసి, పసుపు చల్లి పది నిమిషాలు ఉడికించాలి. తరవాత ఉప్పు, కారం, ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి మిశ్రమం, కొబ్బరిముద్ద వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి.
ముక్కలు బాగా ఉడికిన తరవాత గరంమసాలా వేసి మరో ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. చివర్లో కొత్తిమీరతో అలంకరించి దించేయాలి. అంతే వేడి వేడి సీమ నాటుకోడి పులుసు రెడీ అయినట్లే…!