నెల్లూరు చేపల పులుసు
  • 508 Views

నెల్లూరు చేపల పులుసు

కావలసినవి:

  • చేప ముక్కలు - 600 గ్రా.
  • నూనె - అర కప్పు;
  • ఆవాలు - టీ స్పూన్
  • మెంతులు - టీ స్పూన్;
  • ఉల్లిపాయ తరుగు - కప్పు
  • వెల్లుల్లి తరుగు - 2 టీ స్పూన్లు;
  • కరివేపాకు - రెండు రెమ్మలు;
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 4 టీ స్పూన్లు
  • పసుపు - టీ స్పూన్;
  • కారం - 2 టీ స్పూన్లు
  • ధనియాల పొడి - 2 టీ స్పూన్లు
  • జీలకర్ర పొడి - 1 టీ స్పూను;
  • టొమాటో గుజ్జు - కప్పు
  • కొబ్బరి పేస్ట్ - అర కప్పు
  • పచ్చిమిర్చి నిలువుగా చీరినవి - ఆరు
  • పచ్చి మామిడి ముక్కలు లేదా
  • చింతపండు పులుసు - పావు కప్పు;
  • నీళ్లు - తగినన్ని;
  • ఎండుమిర్చి - రెండు
  • కొత్తిమీర తరుగు - రెండు టీ స్పూన్లు;
  • ఉప్పు - తగినంత

విధానం:

పాన్‌లో నూనె పోసి వేడెక్కాక ఆవాలు, మెంతులు వేయాలి. అవి చిటపటలాడుతుండగా ఉల్లిపాయ తరుగు, వెల్లుల్లి తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి తిప్పి అందులో అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఎండుమిర్చి వేసి ఎరుపురంగు వచ్చేవరకు వేయించాలి. ఈ మిశ్రమంలో టొమాటో గుజ్జు, కొబ్బరి పేస్ట్ వేసి రెండు నిమిషాలపాటు తిప్పి తగినన్ని నీళ్లు, తగినంత ఉప్పు వేసి అయిదారు నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో పచ్చి మామిడి ముక్కలు లేదా చింతపండు పలుసు, శుభ్రపరిచిన చేప ముక్కలు వేసి అన్నిటినీ బాగా కలిపి సన్నని సెగ మీద మూతపెట్టి ఉడికించాలి. కూర చిక్కబడ్డాక గిన్నెలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఈ నెల్లూరి చేపల పులుసు వేడి వేడి అన్నంతో పసందుగా ఉంటుంది.