నూర్‌మహల్ పులావ్
  • 346 Views

నూర్‌మహల్ పులావ్

కావలసినవి:

  • బాస్మతి బియ్యం - 2 కప్పులు
  • గరంమసాలా - టీ స్పూను
  • నూనె - 4 టేబుల్ స్పూన్లు
  • బిరియానీ ఆకు - 1
  • ఉప్పు - తగినంత
  • దాల్చినచెక్క - చిన్న ముక్క
  • చీజ్ - అరకప్పు, లవంగాలు - 6 క్రీమ్ - 3 స్పూన్లు
  • జీలకర్ర - టీ స్పూను
  • కుంకుమపువ్వు - కొద్దిగా
  • ఏలకులు - 8
  • పాలకూర రసం - 2 టేబుల్ స్పూన్లు
  • బటర్ - 2 టేబుల్ స్పూన్లు ఉల్లితరుగు - పావుకప్పు
  • వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీరతరుగు - 2 టేబుల్ స్పూన్లు

విధానం:

బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంటసేపు నానబెట్టాలి. బాణలిలో నూనె వేసి కాగాక బిరియానీ ఆకు, దాల్చినచెక్క, లవంగాలు, జీలకర్ర, ఏలకులు వేసి సన్నని మంట మీద వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్  , గరంమసాలా వేసి కొద్దిగా వేయించాలి. నానబెట్టుకున్న బియ్యం వేసి నాలుగైదు నిముషాలు కలిపి, అందులో నీరు, ఉప్పు వేసి సన్ననిమంట మీద ఉడికించాలి. ఒక చిన్న బౌల్‌లో చీజ్‌తురుము, క్రీమ్, ఉప్పు వేసి కలపాలి. దీనిని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని పాలు, కుంకుమపువ్వు ఉన్న బౌల్‌లో వేయాలి. ఒక భాగం పాలకూర రసంలో వేయాలి. మూడవ భాగాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి నూనెలో వేయించాలి. (వీటినే నూర్ మహల్ అంటారు) ఒక పెద్దపాత్రలో అన్నం ఉడకగానే చీజ్ బాల్స్ లేదా నూర్‌మహల్ వేసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.