ఓట్స్ లాలీ పాప్స్
 • 317 Views

ఓట్స్ లాలీ పాప్స్

కావలసినవి:

 • ఓట్స్ పిండి - ముద్దచేసుకోవటానికి సరిపడా
 • నానబెట్టిన శనగలు - కప్పు
 • మెంతికూర ఆకులు - మూడు కప్పులు
 • పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను
 • అల్లం - చిన్నముక్క
 • లవంగాలు, దాల్చినచెక్క పొడి - అరటీస్పూను
 • కొత్తిమీర - కొద్దిగా
 • పుదీనా - కొద్దిగా
 • ఉల్లితరుగు - కప్పు
 • ఉప్పు - తగినంత
 • నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా
 • ఐస్‌క్రీమ్ పుల్లలు - తగినన్ని

విధానం:

శనగలు, పచ్చిమిర్చి, అల్లం, లవంగాలు, దాల్చినచెక్క అన్నీ కలిపి కొద్దిగా నీరు పోసి మెత్తగా ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా, ఉల్లితరుగు, ఉప్పు, సన్నగా తరిగిన మెంతికూర అన్నీ కలిపి లాలిపాప్స్ చేసుకోవడానికి వచ్చేలా సరిపడా ఓట్స్‌పిండి వేసి కలపాలి. కలిపిన పిండిని ఐస్‌క్రీమ్ పుల్లలకి పెట్టి బాగా కాగిన నూనెలో తక్కువ మంట మీద ఎరగ్రా వేయించుకోవాలి. ఓట్స్ లాలీ పాప్స్