ఒక గిన్నెలో ఓట్స్‌పిండి, గోధుమపిండి, మైదా, వెన్న, ఉప్పు, కొద్దిగా నీరు పోసి చపాతీపిండిలా కలిపి పక్కనుంచుకోవాలి. అయిదు నిముషాలు నానిన తరువాత కొద్దిగా పిండి తీసుకుని ఫొటోలో మాదిరిగా ఒత్తుకోవాలి. బాణలిలో సన్నసెగ మీద కాగిన నూనెలో వీటి ని వేసి దోరగా వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. బెల్లంలో కొద్దిగా నీరు పోసి ఉండపాకం రానిచ్చిన తరువాత అందులో ఏలకుల పొడి వే యాలి. చివరగా వేయించుకున్న స్టిక్స్‌ని ఇందులో వేసి స్టౌవ్ మీద నుంచి దించేయాలి.