ఓట్స్‌సూప్
  • 386 Views

ఓట్స్‌సూప్

కావలసినవి:

  • ఓట్స్ - 3 టేబుల్ స్పూన్లు,
  • బీన్స్ - 15,
  • క్యారెట్ - 1,
  • పచ్చి బఠాణీలు - పావు కప్పు,
  • స్వీట్ కార్న్ - పావు కప్పు,
  • పాలు - అర కప్పు,
  • పెప్పర్ - అర టీ స్పూను,
  • ఉప్పు - రుచికి తగినంత,
  • పంచదార - పావు టీ స్పూను,
  • కొత్తిమీర - అర టేబుల్ స్పూను.

విధానం:

కప్పు నీటిలో ముక్కలుగా తరిగిన క్యారెట్, బీన్స్‌ని ఉడికించి దించేయాలి. మరో కడాయిలో అరకప్పు నీటిని పోసి, ఉడికిన ముక్కలతో పాటు బఠాణీలు, స్వీట్‌కార్న్‌లు వేసి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత ఓట్స్ వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి (మరీ చిక్కబడితే అరకప్పు నీటిని కలుపుకోవచ్చు). పెప్పర్, ఉప్పు, పంచదార వేసి ఒక నిమిషం తర్వాత పాలు కలిపి దించేయాలి. ఇప్పుడు బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీర చల్లి తాగండి.