బియ్యం, మినప్పప్పు నానబెట్టి దోశల పిండిలా మెత్తగా రుబ్బుకోవాలి. బొంబాయి రవ్వ, జీడిపప్పు విడివిడిగా నేతిలో దోరగా వేయించాలి. లీటరు నీళ్లను బాగా మరగబెట్టాలి. అందులో యాలకుల పొడి వేయించిన రవ్వ, జీడిపప్పు, పంచదార, కొబ్బరి తురుము వేసి పావుగంట ఉడకనివ్వాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. వీటిని దోశల పిండిలో ముంచి కాగిన నూనెలో దోరగా వేయించాలి. ప్రసాదం బూరెలు చల్లారిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటాయి