ఆయిల్ లెస్ చికెన్ కర్రీ
  • 256 Views

ఆయిల్ లెస్ చికెన్ కర్రీ

కావలసినవి:

  • కోడిమాంసం - అరకిలో,
  • వెన్న - నిమ్మకాయంత,
  • అల్లం - ఒక ముక్క,
  • ఉల్లిపాయ - ఒకటి,
  • మిరియాలు - ఆరు, ధనియాలు - అరస్పూను,
  • పసుపు - ఒక స్పూను,
  • కారం - ఒక స్పూను,
  • కొత్తిమీర - ఒక కట్ట,
  • ఉప్పు - ఒక స్పూను.

విధానం:

ముందుగా కొడి మాంసాన్ని శుభ్రంగా కడిగి ఒక బాణిళిలో నీళ్లు పోసి ఉడకబెట్టాలి. ఈలోగా కొంచెం సేపు తర్వాత అల్లం, మిరియాలు, ధనియాల పొడి, కారం మొత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్టౌమీద ఉడుకుతున్న కోడి మాంసం ముక్కల్లో వేసి సన్నని మంటపై ఉడికించాలి.

అటు తర్వాత స్టౌమీద ఒక బాణలిలో వెన్న వేసి అది బాగా కరిగిన అనంతరం అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి. ఆ తర్వాత అంతకుముందు మనం తీసుకున్న కోడి మాంసపు మిశ్రమానికి ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుని మళ్లీ మరో పదినిమిషాల పాటు ఉడకబెట్టి దించేయాలి. దించేముందు కొత్తి మీర ఆ మిశ్రమంలో వేసి దించాలి. ఇప్పుడు ఆయిల్ లెస్ చికెన్ కర్రీ రెడీ..