ఆనియన్ బిర్యానీ
 • 477 Views

ఆనియన్ బిర్యానీ

కావలసినవి:

 • బాస్మతి రైస్ - 200గ్రా
 • నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
 • జీలకర్ర- అర టీ స్పూన్
 • మిరియాలు- టీ స్పూన్
 • లవంగాలు - మూడు
 • ఏలకులు - రెండు
 • బిర్యానీ ఆకు- ఒకటి
 • ఉల్లిపాయ ముక్కలు - 50 గ్రా
 • చిన్న ఉల్లిపాయలు - 50 గ్రా
 • ఉప్పు- తగినంత
 • తరిగిన కొత్తిమీర - పదిగ్రాములు
 • గార్నిష్ చేయడానికి - నేతిలో వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా

విధానం:

ముందుగా అన్నం వండి చల్లారనివ్వాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర, మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయలను వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు అన్నం, ఉప్పు వేసి కలిపి దించేయాలి. నేతిలో వేయించిన ఉల్లిపాయముక్కలు, తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.