ఉల్లిపాయ పచ్చడి
  • 426 Views

ఉల్లిపాయ పచ్చడి

కావలసినవి:

  • ఉల్లిపాయలు - 4 (పెద్దవి),
  • చింతపండు - చిన్ననిమ్మకాయంత
  • ఎండుమిర్చి - 5,
  • ఉప్పు - తగినంత
  • ఇంగువ - కొద్దిగా,
  • వేయించిన పోపు - రెండు టీ స్పూన్లు

విధానం:

ముందుగా ఉల్లిపాయలను ఒలిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలలో ఉప్పు, చింతపండు కలిపి రోట్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తరవాత ఒక బాణలిలో కొద్దిగా నూనె, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చిముక్కలు, కొద్దిగా ఇంగువ వేసి పోపు వేయించి ఈ పచ్చడిలో కలపాలి. (ఈ పచ్చడిని మిక్సీలో చేస్తే సరిగా రాదు)