ఉల్లిపాయ పులుసు
 • 396 Views

ఉల్లిపాయ పులుసు

కావలసినవి:

 • ఉల్లిపాయలు - 4 (పెద్దవి)
 • చింతపండు - చిన్ననిమ్మకాయంత
 • పచ్చిమిర్చి - 4 (నిలువుగా, పెద్దగా కట్ చేసుకోవాలి)
 • ఉప్పు - తగినంత
 • పసుపు - చిటికెడు
 • శనగపిండి - మూడు టీ స్పూన్లు
 • బెల్లం - కొద్దిగా


పోపు:

 • ఆవాలు - అర టీ స్పూను
 • ఎండుమిర్చి - నాలుగు, నూనె - టీ స్పూను, ఇంగువ - చిటికెడు
 • మినప్పప్పు - టీ స్పూను

విధానం:

ఉల్లిపాయలను ఒలిచి మీడియం సైజులో క ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో కొద్దిగా నీరు పోసి అందులో చింతపండును నానపెట్టాలి. బాగా నానిన తరవాత చిక్కగా పులుసు తీసి చింతపండు పిప్పి తీసేయాలి. ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, బెల్లం, తరిగిన పచ్చిమిర్చి, రెండు గ్లాసుల నీరు పోసి ముక్క మెత్తపడేవరకు ఉడికించాలి. తరవాత అందులో చింతపండురసం పోయాలి. ఇది కూడా బాగా ఉడికిన తరవాత ఇందులో నీళ్లలో కలిపిన శనగపిండిని పోయాలి. అన్నీ బాగా మరిగిన తరవాత అందులో వేయించి ఉంచుకున్న పోపు వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర, కరివేపాకులతో గార్నిష్ చేయాలి. ఇది అన్నంలోకి, ముద్దపప్పులోకి చాలా రుచిగా ఉంటుంది.