గిన్నెలు నూనె పోసి మరిగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి దోరగా వేయించి (రొయ్యలు శుభ్రంగా ఉప్పు వేసి కడగాలి) రొయ్యలను వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా ఎర్రగా నూనెలో వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసి రొయ్యలు ఉడుకుతుండగా కోడిగుడ్లను కొట్టి అందులో వెయ్యాలి. బాగా కలిపి నూనె పైకి వచ్చే వరకు బాగా వేయించి కొత్తిమీర వేసి దించుకోవాలి.