కొబ్బరి పచ్చిశనగపప్పు కూర
 • 533 Views

కొబ్బరి పచ్చిశనగపప్పు కూర

కావలసినవి:

 • కొబ్బరికాయ -1
 • పచ్చిశనగపప్పు - పావుకిలో
 • కారం - 3 చెంచాలు
 • ఉప్పు - సరిపడా
 • నూనె - 2 చెంచాలు
 • జీలకర్ర - 1టీస్పూన్‌
 • ఆవాలు - 1 టీ స్పూన్‌
 • మినపపప్పు - 1 టీ స్పూన్‌
 • ఎండుమిర్చి- 4
 • వెల్లుల్లి రెబ్బలు - 4
 • కరివేపాకు - 2 రెబ్బలు

విధానం:

కొబ్బరిని మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత శనగపప్పును ముం దుగా కుక్కర్‌లో కొద్దిగా ఉడక బెట్టుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత పోపు తాలింపు వేసి ఉడికిన శనగపప్పు వేసి వే యించి తర్వాత కొబ్బరి పొడి వేసి నూనెలో వేగుతుం డగా ఉప్పు, పసుపు, కారం వేసి బాగా వేగిన తర్వాత దించుకోవాలి